![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -114 లో..... ధీరజ్ వళ్లే చందు అరెస్ట్ అయ్యాడని రామరాజు ధీరజ్ ని కొడతాడు. నువ్వు నా పరువు తియ్యడానికి పుట్టావ్ రా అంటూ ధీరజ్ పై రామరాజు కోప్పడతాడు.. ధీరజ్ ఏం చెప్పిన వినే సిచువేషన్ లో రామరాజు ఉండడు. ఆ తర్వాత ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్లి ఇదంతా నీ వల్లే అని తిడతాడు. నా వల్లే ఏంటని ప్రేమ అడుగుతుంది.
నువ్వు మీ ఇంటికి వెళ్ళావ్.. మీ అన్నయ్య కొట్టబోతుంటే ఆ దెబ్బ మా నాన్నకి తగిలింది.. ఆ కోపంతో నేను మా అన్నయ్య కలిసి మీ అన్నయ్యని కొట్టాం.. వాడు కేసు పెట్టాడని ధీరజ్ అంటుంటే ప్రేమ బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం స్టేషన్ నుండీ ఎస్ ఐ భద్రవతి, రామరాజులకి కాల్ చేసి స్టేషన్ కి రమ్మంటాడు. తీరా చుస్తే విశ్వపై ప్రేమ కేసు పెడుతుంది. ఇరు కుటుంబాలు రాజీ పడకుంటే రెండు కేసులు కోర్ట్ కి వెళ్తాయని ఎస్ఐ చెప్పడంతో పర్లేదని విశ్వ అంటాడు. వద్దు కేసు వాపస్ తీసుకుంటున్నామని భద్రవతి అంటుంది. ఆ తర్వాత ప్రేమ బయటకు వెళ్తుంది. చందు బయటకు రావడంతో రామరాజు కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతారు.
ప్రేమ బయట బాధపడుతుంటే భద్రవతి వెళ్తు.. ప్రేమ దగ్గర ఆగుతుంది. మీ అన్నయ్యపై కేసు పెట్టావంటే ఎంతలా మారిపోయావో అర్థమవుతుందని భద్రవతి కోపంగా వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో రామరాజు ఇంటికి శ్రీవల్లిని తీసుకొని భాగ్యం ఇంటికి వస్తుంది. చూడండి దీని వరుస.. చేసుకుంటే మీ అబ్బాయినే చేసుకుంటాను అంటుందని రామరాజు వాళ్ళతో భాగ్యం చెప్తుంది. నన్ను అయన బాగా చూసుకుంటారనిపిస్తుందని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |